నారాయణపూర్  చెరువు అభివృద్ధికి రూ.20 కోట్లు

నారాయణపూర్  చెరువు అభివృద్ధికి రూ.20 కోట్లు

గంగాధర, వెలుగు: కరీంనగర్ ​జిల్లా గంగాధర మండలం నారాయణపూర్​ రిజర్వాయర్​లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నారాయణపూర్​ చెరువు అభివృద్ధికి ప్రభుత్వం మరో రూ.20 కోట్లు మంజూరుచేసింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని నారాయణపూర్ చెరువు అభివృద్ధి, బండ్ విస్తరణ పనులకు కీలకమైన భూసేకరణకు నిధులు విడుదల చేసింది.

ఈ నిధులతో నారాయణపూర్ చెరువు అభివృద్ధి పనులు మరింత వేగవంతం కానున్నాయి. బండ్ విస్తరణ, గ్రావిటీ కాలువ నిర్మాణం, చెరువుల ఆధునికీకరణ పనులకు మోక్షం కలగనుంది. దీంతో పాటు గంగాధర, స్తంభంపల్లి చెరువుల అప్‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్ పనులు కూడా స్పీడప్ కానున్నాయి. నిధులు విడుదల చేసిన ప్రభుత్వానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ధన్యవాదాలు తెలిపారు.