రాహుల్, హుడా హాఫ్ సెంచరీలు: హైదరాబాద్ టార్గెట్-170

రాహుల్, హుడా హాఫ్ సెంచరీలు: హైదరాబాద్ టార్గెట్-170

ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌  ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 రన్స్ చేసింది. కేఎల్‌ రాహుల్‌ 68 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దీపక్‌ హుడా 54 పరుగులు సాధించాడు. 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కేఎల్‌ రాహుల్‌, దీపక్‌ హుడాలు విలువైన 87 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో నటరాజన్‌, షెపర్డ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలా రెండు వికెట్లు తీశారు.