IPL 2026: భారత ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈరోజు ( మార్చి 15న) ప్రకటించింది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండో దశ షెడ్యూల్ ప్రకటించడానికి మార్గం సుగమమైంది. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీ) త్వరలోనే టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే టోర్నమెంట్‌కు సంబంధించిన మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే విడుదలైంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకుని మిగతా మ్యాచ్‌ల తేదీలను అప్పటి వరకు నిలిపివేశారు. ముఖ్యంగా కోల్‌కతా, చెన్నై వేదికలపై హోమ్ మ్యాచ్‌లు ఆడే కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై ఈ ఎన్నికల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తుంది.
కాగా ఈరోజు భారత ఎన్నికల సంఘం అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఎన్నికలు ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 29 వరకు దశలవారీగా నిర్వహించబడతాయి. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన జరగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 824 నియోజకవర్గాల్లో సుమారు 17.4 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. భద్రతా ఏర్పాట్లు విస్తృతంగా చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతా సిబ్బందిని పెద్ద ఎత్తున ఉపయోగించాల్సి ఉండటంతో ఐపీఎల్ షెడ్యూల్‌పై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించిన ప్రకటనలో కూడా మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. పూర్తి షెడ్యూల్‌ని ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. ఎలక్షన్ డేట్స్ రావడంతో.. త్వరలోనే ఐపీఎల్ 2026 టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ బయటకు వచ్చే అవకాశం ఉంది.
►ALSO READ | Yash Dayal: సిక్రెట్గా పెళ్లి చేసుకున్న ఆర్సీబీ ప్లేయర్
ప్రతి సంవత్సరం ఐపీఎల్లో ఈ రెండు రాష్ట్రాలు కీలక వేదికలుగా నిలుస్తాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంతో పాటు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియాలలో జరిగే మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు వస్తుంటారు. ఇక ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ మార్చి 28వ తేదీన బెంగళూరులో జరగనుంది. ఆ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడనున్నాయి. అయితే బెంగళూరు స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి అధికారుల నుంచి తుది ఎన్ఓసీ రావాల్సి ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రేపు (మార్చి 16న) వచ్చే ఛాన్స్ ఉంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం:
* అస్సాం – ఏప్రిల్ 9, 2026 – ఓట్ల లెక్కింపు మే 4, 2026
* కేరళం – ఏప్రిల్ 9, 2026 – ఓట్ల లెక్కింపు మే 4, 2026
* పుదుచ్చేరి – ఏప్రిల్ 9, 2026 – ఓట్ల లెక్కింపు మే 4, 2026
* తమిళనాడు – ఏప్రిల్ 23, 2026 – ఓట్ల లెక్కింపు మే 4, 2026
* పశ్చిమ బెంగాల్ – ఏప్రిల్ 23, ఏప్రిల్ 29, 2026 – ఓట్ల లెక్కింపు మే 4, 2026
