ఐపీఎల్ బెట్టింగ్ నిర్వాహకుడు అరెస్ట్.. ఖమ్మంజిల్లా కొణిజెర్ల పోలీసుల అదుపులో నిందితుడు

ఐపీఎల్ బెట్టింగ్ నిర్వాహకుడు అరెస్ట్.. ఖమ్మంజిల్లా కొణిజెర్ల పోలీసుల అదుపులో నిందితుడు

కొణిజర్ల, వెలుగు: మండల పరిధిలోని తనికెళ్ల గ్రామంలో అక్రమంగా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని కొణిజర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనికెళ్ల గ్రామంలోని అమ్మ టిఫిన్ సెంటర్ వద్ద ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్సై సూరజ్ తన సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు.

బెట్టింగ్​ నిర్వాహకుడు గుగులోత్ వెంకటేశ్​ను రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద రూ.3 వేలు, బెట్టింగ్‌‌కు సంబంధించిన ఎనిమిది పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు. నిందితులు ఫోన్ కాల్స్ ద్వారా ఆఫ్‌‌లైన్ విధానంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.