ఏప్రిల్ 16న ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓనర్ల మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఏప్రిల్ 16న ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓనర్ల మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ :  వచ్చే సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేలం కోసం ఫ్రాంచైజీలకు కేటాయించే మొత్తాన్ని పెంచడం, ప్లేయర్ల రిటెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్చించేందుకు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పది జట్ల ఓనర్లతో బీసీసీఐ ఈ నెల 16న సమావేశం కానుంది. అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్ సందర్భంగా ఈ అనధికారిక మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగనుంది. ‘ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓనర్లందరినీ అనధికారిక సమావేశం కోసం బీసీసీఐ ఆహ్వానించింది. దీనికి ఎజెండా ఏమీ లేదు.

ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో నెలలోకి చేరుతున్న నేపథ్యంలో  వాటాదారులందరినీ ఒక్కచోటుకి తెచ్చేందుకు ఇదే మంచి సమయం’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరుణ్ ధూమల్ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. 18వ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఈ ఏడాది చివర్లో  మెగా వేలం జరగనుంది. ప్రస్తుతం వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఒక్కో ఫ్రాంచైజీకి రూ. వంద కోట్లు కేటాయిస్తుండగా..

రాబోయే సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఈ మొత్తాన్ని పెంచే విషయంపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే,  ప్లేయర్ల రిటెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనా చర్చ జరిగే చాన్సుంది. ఇప్పటిదాకా మూడేండ్లకోసారి జరిగే మెగా వేలంలో ఒక్కో జట్టు నలుగురు ప్లేయర్లను రిటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకునే అవకాశం ఇచ్చారు. చివరగా 2022లో మెగా వేలం నిర్వహించారు.