ఉప్పల్లో RCBvsSRH మ్యాచ్.. ఏ టీంకి గెలిచే ఛాన్స్ ఉందంటే..

ఉప్పల్లో RCBvsSRH మ్యాచ్.. ఏ టీంకి గెలిచే ఛాన్స్ ఉందంటే..

హైదరాబాద్: ఈ ఐపీఎల్ సీజన్లో మరో రసవత్తర పోరుకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికైంది. ప్లే ఆఫ్స్కు అర్హత సాధించి.. పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మూడో స్థానంలో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడబోతున్నాయి. 

ఈ ఐపీఎల్ సీజన్లో SRH సొంత గడ్డపై ఆరు మ్యాచులు ఆడింది. ఈ ఆరు మ్యాచుల్లో నాలుగు మ్యాచులు గెలిచి సత్తా చాటింది. ఉప్పల్ పిచ్ రిపోర్ట్ను పరిశీలిస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ జట్టు టాస్ గెలిచినా తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

SRH తొలుత బ్యాటింగ్ చేసిన.. నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఛేజింగ్ చేసే సమయంలో.. పిచ్ నెమ్మదిస్తుందని.. దీని వల్ల సెకండ్ ఇన్నింగ్స్ జట్టు పరుగులు చేయడం మరింత కష్టమవుతుందని పిచ్ రిపోర్ట్ స్పష్టం చేస్తుంది. ఇక.. ఉప్పల్లో ఈ రెండు జట్ల ట్రాక్ రికార్డ్ విషయానికొస్తే.. SRH, RCB ఈ స్టేడియంలో ఇప్పటికి తొమ్మిది సార్లు తలపడ్డాయి. 2013లో సూపర్ ఓవర్ వరకూ వెళ్లి.. SRH ఒక టై మ్యాచ్ కూడా గెలిచింది. ఈ టై మ్యాచ్లో గెలుపును పక్కన పెడితే.. SRH మొత్తం ఐదు మ్యాచుల్లో విజయం సాధిస్తే, బెంగళూరు జట్టు 3 మ్యాచుల్లో గెలిచింది.

Also Read : SRHvsRCB మ్యాచ్ టికెట్ల దందా వెలుగులోకి

ఇలా.. SRH సొంత గడ్డపై ఆధిపత్యంతో నిలిచింది. అయితే.. RCBకి కలిసొచ్చే అంశం ఏంటంటే.. SRH జట్టు నిర్దేశించిన టార్గెట్ను RCB రెండుసార్లు సక్సెస్ ఫుల్గా ఛేజ్ చేసి మరీ గెలిచింది. అందువల్ల SRH ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ నిర్దేశిస్తే RCB ఛేజ్ చేసే ఛాన్స్ లేదని చెప్పలేం. సో.. ఎలా చూసుకున్నా SRH, RCB మ్యాచ్ ఇరు జట్ల అభిమానులకు ఒక మంచి థ్రిల్లర్ సినిమాను చూసిన అనుభవాన్ని మిగుల్చుతుందనడంలో సందేహం లేదు.