అమెరికా బ్లాకేడ్ తో ఇరాన్ కు రూ.45 వేల కోట్లు నష్టం

అమెరికా బ్లాకేడ్ తో ఇరాన్ కు రూ.45 వేల కోట్లు నష్టం

న్యూఢిల్లీ: హార్మూజ్  జలసంధిలో అమెరికా బ్లాకేడ్ తో ఇరాన్ కు ఇప్పటివరకూ 4.8  బిలియన్  డాలర్ల (రూ.45.50 వేల కోట్లు) నష్టం వాటిల్లిందని అమెరికా వార్తా సంస్థ యాక్సిస్  వెల్లడించింది. బ్లాకేడ్ కారణంగా ఇరాన్​కు చెందిన 31 ఆయిల్ ట్యాంకర్లు ఇంకా గల్ఫ్​ ఆఫ్ ఒమన్ లోనే చిక్కుకుపోయాయని, వాటిలో 53 మిలియన్  బ్యారెళ్ల చమురు ఉందని తెలిపింది. దీంతో ఆయిల్  రెవెన్యూను  ఇరాన్  భారీగా కోల్పోయిందని పేర్కొంది. 

డొనాల్డ్  ట్రంప్  ఆదేశంతో గత నెల 13న హార్మూజ్  జలసంధిని అమెరికా నేవీ బలగాలు బ్లాక్ చేశాయి. దీంతో ఫ్రెష్ ట్యాంకర్లను లోడ్ చేయలేక ఇరాన్​తన పాత నౌకలను ఫ్లోటింగ్ వేర్​హౌసులుగా వాడుతోంది. 

అయితే, స్టోరేజ్ కెపాసిటీ పూర్తయిపోవడంతో నిల్వ చేయలేక చమురు బావులను మూసివేయాల్సి వస్తుందని యురేషియా గ్రూప్​కు చెందిన గ్రెగొరీ బ్రూ తెలిపారు.