హార్మూజ్ జల సంధిని దిగ్బంధనం ప్రారంభించిన అమెరికాకు ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఇరాన్. ప్రపంచంపై పెత్తనం అందరికీ ఉండాలి.. లేదంటే ఎవరికీ ఉండకూడదు.. అదే విధంగా హర్మూజ్ జల సంధిపై హక్కులు, పెత్తనం అందరికీ ఉండాలి లేకుంటే ఎవరికీ ఉండకూడదు.. ఈ విషయంపై ఇరాన్ చాలా క్లారిటీగా ఉందని.. ఇరాన్ ప్రజలు ఇదే భావిస్తున్నారని స్పష్టం చేసింది ఇరాన్.
ఇన్నాళ్లు హర్మూజ్ జల సంధిపై అందరికీ హక్కులు ఉన్నాయని.. ఎలాంటి ఇబ్బంది లేదని.. ప్రతి దేశం నౌక ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించాయన్న విషయాన్ని గుర్తు చేస్తోంది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఎప్పుడైతే యుద్ధం మొదలుపెట్టాయో అప్పుడే వివాదం వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ అమెరికా మిత్ర దేశాలకు సందేశం పంపింది ఇరాన్.
హర్మూజ్ జల సంధిపై పట్టు సాధించేందుకు.. పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు చురుగ్గా పని చేస్తున్నామని.. ఈ జల సంధి నుంచి వెళ్లాలి అనుకుంటే ఆయిల్ నౌకలు పన్నులు చెల్లించాలనే ప్రణాళిక ఉందని స్పష్టం చేసింది ఇరాన్. హర్మూజ్ జల సంధి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామని.. చాలా చాలా క్లియర్ గా మా ప్రణాళిక ఉందని వెల్లడించింది ఇరాన్.
జల సంధి భద్రత నిర్థారించడం, రాకపోకలపై నియంత్రణ, పన్నులు వసూలు చేయటంపై ధృడంగా ఉన్నామని.. ఇందులో ఎలాంటి మార్పు లేదని వివరించింది ఇరాన్. అదే విధంగా మా శత్రు దేశాలు, శత్రు దేశాలకు అనుకూలంగా.. వాళ్లకు మద్దతు ఇస్తున్న దేశాల నౌకలను ఈ మార్గం నుంచి వెళ్లనిచ్చేది లేదని.. వాటికి అనుమతి లేదని.. ఈ విషయంలోనూ ఎంతో స్పష్టంగా ఉన్నట్లు వెల్లడించింది ఇరాన్.
అందరికీ భద్రత, భరోసా ఉండాలి.. లేకపోతే ఎవరికీ భద్రత, భరోసా ఉండదు ఇదే మా విధానం.. మా ప్రణాళిక.. మా దేశం నౌకలపై దాడులు చేస్తే.. శత్రు దేశాలు, వాళ్లకు మద్దతు ఇచ్చే దేశాల నౌకలపై తీవ్రంగా దాడి చేస్తామంటూ ఇరాన్ తన సందేశాన్ని స్పష్టంగా ప్రపంచ దేశాలకు వెల్లడించింది.

