Good News : ఉద్యోగాలకు ఇర్కాన్ నోటిఫికేషన్ విడుదల : జూన్ 13 లాస్ట్ డేట్.. వెంటనే అప్లయ్ చేయండి..!

Good News : ఉద్యోగాలకు ఇర్కాన్ నోటిఫికేషన్ విడుదల : జూన్ 13 లాస్ట్ డేట్.. వెంటనే అప్లయ్ చేయండి..!

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(ఐఆర్​సీఓఎన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు ఆఖరు తేదీ జూన్ 13.

ఎగ్జిక్యూటివ్​/ సివిల్ పోస్టులు

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులకు తగ్గకుండా సివిల్ ఇంజినీరింగ్​లో గ్రాడ్యుయేషన్​తోపాటు పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్: ఆఫ్​​లైన్ ద్వారా. జేజీఎం, హెచ్ఆర్ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ–4, డిస్ట్రిక్ సెంటర్, సాకెట్, న్యూఢిల్లీ 110017 అడ్రస్ కు దరఖాస్తులు పంపించాలి. 
అప్లికేషన్ల ప్రారంభం: మే 24.
లాస్ట్ డేట్: జూన్ 13.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​లో గ్రాడ్యుయేషన్ తోపాటు పని అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 2025, మే 1 నాటికి 30 ఏండ్లు ఉండాలి.
అప్లికేషన్: ఆఫ్​​లైన్ ద్వారా. జేజీఎం, హెచ్ఆర్ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ-4, డిస్ట్రిక్ సెంటర్, సాకెట్, న్యూఢిల్లీ 110017 అడ్రస్ కు దరఖాస్తులు పంపించాలి. 

అప్లికేషన్ల ప్రారంభం: మే 24.
లాస్ట్ డేట్: జూన్ 13.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.