ఐఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకున్న గాడ్‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌ కొచ్చి

ఐఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకున్న గాడ్‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌ కొచ్చి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇండియన్‌‌‌‌‌‌‌‌ రేసింగ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ (ఐఆర్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌)  ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో టైటిల్‌‌‌‌‌‌‌‌ గెలుస్తుందని ఆశించిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌ బర్డ్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ రన్నరప్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టింది. మూడు రేసుల తర్వాత టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచిన బ్లాక్‌‌‌‌‌‌‌‌బర్డ్స్‌‌‌‌‌‌‌‌ ఆదివారం సొంతగడ్డ, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌పై నిరాశ పరిచింది.

నాలుగో రౌండ్‌‌‌‌‌‌‌‌లో  రెండు స్ప్రింట్‌‌‌‌‌‌‌‌ రేసులతో పాటు ఫీచర్‌‌‌‌‌‌‌‌ రేసును గెలిచిన గాడ్ స్పీడ్‌‌‌‌‌‌‌‌ కొచ్చి మొత్తం 417.5 పాయింట్లతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో టైటిల్‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకుంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 385 పాయింట్లతో రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలవగా, గోవా ఏసెస్‌‌‌‌‌‌‌‌ 282 పాయింట్లతో మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌ సాధించింది. చెన్నై (279), బెంగళూరు (147.5), ఢిల్లీ (141) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా, శనివారం ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌కే పరిమితమైన ఆరు జట్లు.. ఆదివారం వర్షంలోనే దూసుకెళ్లాయి.