ఆగస్టు 16న మహానది పరిశీలనకు కమిటీని అపాయింట్​ చేసిన ఇరిగేషన్ శాఖ

ఆగస్టు 16న మహానది పరిశీలనకు కమిటీని అపాయింట్​ చేసిన ఇరిగేషన్ శాఖ

హైదరాబాద్, వెలుగు: భద్రాచలం, దాని సమీప ప్రాంతాలను పోలవరం బ్యాక్ వాటర్, గోదావరి వరదల నుంచి రక్షించడానికి చేపట్టాల్సిన చర్యలపై స్టడీ చేయాలని ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​నిర్ణయించింది. దానికోసం కొత్తగా టెక్నికల్​కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి​చైర్మన్​గా  ఈఎన్సీ నాగేందర్, ప్రాజెక్ట్​అండ్​మెయింటనెన్స్​ఎస్ఈ శ్రీనివాస్ కన్వీనర్​గా వ్యవహరిస్తారు. సెంట్రల్​డిజైన్​ఆర్గనైజేషన్​ సీఈ చంద్రశేఖర్, రిటైర్డ్​ఈఎన్సీ రాజరాజుతో పాటు పలువురు నిపుణులను సభ్యులుగా నియమించారు. 

ఈ కమిటీ ఈ నెల 16 నుంచి 18 వరకు ఒడిశాలోని మహానది బేసిన్, 20 నుంచి 22 వరకు బ్రహ్మపుత్ర బేసిన్, 29 నుంచి 31 వరకు ఉత్తరప్రదేశ్​లోని గంగానది బేసిన్​ప్రాంతాల్లో పర్యటించనుంది. 2022తోపాటు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా కురిసిన వర్షాలకు భద్రాచలం పరిసర ఏరియాలు పది రోజులకు పైగా నీట మునిగాయి. దీంతో భద్రాచలంతో పాటు మణుగూరు హెవీ వాటర్​ప్లాంట్, సారపాక ఐటీసీ సహా పరిసర గ్రామాలు నీట మునగకుండా శాశ్వత చర్యలకు ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​ఉపక్రమించింది. వరదల నుంచి ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనే దానిపై ఈ కమిటీ రిపోర్టు రెడీ చేసి సర్కారుకు ఇవ్వనున్నది.