
- అధికారులతో ఇరిగేషన్‌శాఖ ముఖ్య కార్యదర్శి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలపై సర్కారు దృష్టి సారించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఫైనల్ రిపోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్టు ఆధారంగా ఏం చేయాలన్న దానిపై సోమవారం ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా.. ఆ శాఖఅధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణ సంస్థలూ సమీక్షలో పాల్గొన్నట్టు తెలిసింది.
బ్యారేజీల వద్ద చేయాల్సిన టెస్టులు, ఇన్వెస్టిగేషన్స్ వంటి అంశాలపై రాహుల్ బొజ్జా ఆరా తీసినట్టు సమాచారం. బ్యారేజీల రిపేర్లకు చేపట్టాల్సిన చర్యలు, మేడిగడ్డ ఏడో బ్లాక్ పునరుద్ధరణ తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. కాగా, ఇటీవల కాళేశ్వరం బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ ఏడో బ్యారేజీని పూర్తిగా తొలగించి కొత్తగా కట్టాలని చెప్పడంతోపాటు.. మూడు బ్యారేజీలకు రీహాబిలిటేషన్ డిజైన్లను సూచించింది.