ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు ఇస్తోందా? ఈ వార్త నిజమా

 ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు ఇస్తోందా? ఈ వార్త నిజమా

ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు ఇస్తోందా? ఉచితంగా అంటే ఎవరికి ఆశ ఉండదు. అదీ కాకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా ఏదైనా వస్తువు వస్తుందంటే ఎవరు మాత్రం కాదంటారు. ప్రస్తుతం ఈ రూమర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ రూమర్ నిజమేనా.. ఒకవేళ ఇస్తే ఎందుకు ఇస్తుంది అన్న విషయాలు ఒక్కసారి ఆలోచించండి. సాంకేతికత వచ్చాక.. ఎంత అభివృద్ధి జరిగిందో.. అంతకంటే ఎక్కువ మోసాలూ జరుగుతున్నాయడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఈ వార్త నిజమా, కాదా అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వం ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు ఇస్తుందా? 

 'ప్రధాన్ మంత్రి స్మార్ట్‌ఫోన్ యోజన 2023' కింద కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచిత స్మార్ట్‌ఫోన్‌లను అందజేస్తోందని పేర్కొంటూ "సర్కారీ వ్లాగ్" అనే యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియో వైరల్ అవుతోంది. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తనిఖీ చేయగా ఈ వీడియో నిజం కాదని,  ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని తేల్చి చెప్పింది. పీఐబీ తన వాస్తవ పరిశీలనలో ఈ వీడియో నకిలీదని, అలాంటి వీడియోలను సబ్‌స్క్రైబ్ చేయవద్దని ప్రజలను హెచ్చరించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఇలాంటి వార్తలను చూసి ఎవరూ మోసపోవద్దని సూచించింది.

'ప్రధాన మంత్రి స్మార్ట్‌ఫోన్ యోజన 2023' కింద కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు అందజేస్తోందని పేర్కొంటూ ఒక వీడియో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వీడియోపై తనిఖీ నిర్వహించి అది నకిలీదని తేల్చింది. ఉచిత స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీ చేస్తామని ప్రధాని నుంచి ఎలాంటి ప్రకటన లేదని వివరించింది. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా ప్రజలను PIB హెచ్చరించింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోన్న ప్రభుత్వ విధానాలు,  పథకాలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కృషి చేస్తోంది.

https://twitter.com/PIBFactCheck/status/1648271592026439681