బిహార్ ఎన్నికల ఫలితాలు..జైల్లో ఉన్న జేడీయూ అభ్యర్థి అనంత్ ముందంజ

బిహార్ ఎన్నికల ఫలితాలు..జైల్లో ఉన్న జేడీయూ అభ్యర్థి అనంత్ ముందంజ

బిహార్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉంది.. మొత్తం 243 స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఎన్డీయే కూటమి 190, మహా గడ్​ బంధన్ కూటమి 49, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎన్డీయే కూటమిలోని జెడీయూ 75 స్థానాల్లో లీడ్​ లో ఉంది.. మొకామా నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థి, హత్య కేసులో జైల్లో ఉన్న అనంత్​ కుమార్ సింగ్​భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థ ఆర్జేడీ అభ్యర్థివీణాదేవిపై 13వేల ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. 

ఇటీవల జన్​ సురాజ్​ పార్టీ (JSP) నేత  దులార్ సింగ్ యాదవ్​ హత్య తర్వాత మొకామా నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది.. నవంబర్​2 దులార్​ సింగ్ యాదవ్​హత్య కేసులో అరెస్ట్​అయి అనంత్​ కుమార్​ సింగ్​ ప్రస్తుతం జైలులో ఉన్నారు. బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉంది.జెడీయూ అభ్యర్థి అనంత్​ కుమార్​ సింగ్​కు 42వేల 002 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి ఆర్జేడీ వీణా దేవికి 28వేల 368 ఓట్లు వచ్చాయి. 

దులాసింగ్​యాదవ్​ హత్య కేసులో అనంత్​ కుమార్​ సింగ్​తో సహా అతని సహచరులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మొకామా నుంచి ఐదుసార్లు గెలిచిన అనంత్​ కుమార్ సింగ్.. పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. అక్రమ ఆయుధాలు కలిగిఉన్న కేసులో దోషిగా తేలడంతో 2022లో అతనిపై అనర్హత వేటుపడింది. ఆ తర్వాత ఆయన భార్య నీలందేవీ ఆ స్థానం నుంచి  ఉపఎన్నికలో గెలిచింది.

ఎలక్షన్​ కమిషన్​ వెబ్​ సైట్ ప్రకారం.. బీహార్​ లో ఏక పక్ష పోటీ నెలకొంది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే 188 స్థానాల్లో ఆధిక్యంలోఉంది..ఇండియా కూటమికి 50 స్థానాలు చేరుకునేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. 

బీజెపి 86 స్థానాల్లో ఆధిక్యంతో ఏకైక అతిపెద్ద పార్టీగా ఉండగా.. జేడీయూ 75స్థానాల్లో ఆధిక్యంలో రెండో స్థానంలో ఉంది. అయితే 2020 ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన ఆర్జేడీ 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.