మిగిలిపోయిన గోధుమ పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా ? డాక్టర్ల హెచ్చరిక.. ఆ జబ్బులు రావచ్చు!

మిగిలిపోయిన గోధుమ పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా ? డాక్టర్ల హెచ్చరిక.. ఆ జబ్బులు రావచ్చు!

ఈ రోజుల్లో ఉదయం పూట హడావిడి తగ్గించుకోవడానికి, టైం ఆదా చేసుకోవడానికి చాలా మంది ఇళ్లలో చపాతీ పిండిని ముందే కలిపి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇది మనకు చాలా మామూలు అలవాటుగా అనిపించవచ్చు. కానీ, దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే పిండిలో నీళ్లు కలపడం వల్ల తేమ చేరుతుంది. దీనిని సరిగ్గా దాచకపోతే అందులో బ్యాక్టీరియా చేరి, పిండి పులిసిపోయే ప్రమాదం ఉంది. దీనిపై ప్రముఖ డాక్టర్ ఎం చెపుతున్నారంటే....

ఫ్రిజ్‌లో పిండిని ఎన్ని గంటలు ఉంచాలి 
ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఫ్రిజ్‌లో పెట్టిన పిండిని వాడుకోవచ్చు. కానీ కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి:
*పిండిని కలిపిన 12 నుండి 24 గంటల లోపే వాడేయాలి. 24 గంటలు దాటితే ఆ పిండి నాణ్యత తగ్గిపోతుంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు.
*పిండిని ఎప్పుడూ కూడా ఒక శుభ్రమైన, మూత గట్టిగా ఉండే గాలి చొరబడని (Air-tight) డబ్బాలో పెట్టి మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి.

పిండిని బయట వదిలేస్తే వచ్చే జబ్బులు
పిండిని కలిపిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టకుండా, వంటగదిలో గది ఉష్ణోగ్రత వద్ద కొన్ని గంటల పాటు అలాగే వదిలేస్తే అది చాలా త్వరగా పాడైపోతుంది. వెచ్చని వాతావరణంలో ఇ.కోలి (E. Coli), సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు చాలా వేగంగా పెరుగుతాయి. మురికి చేతులు, శుభ్రం లేని పాత్రలు, కిచెన్ లో ఉండే తేమ వల్ల ఈ బ్యాక్టీరియా పిండిలోకి చేరుతుంది. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా పెరగడం కాస్త నెమ్మదిస్తుందే తప్ప, పూర్తిగా ఆగిపోదు.

పిండి పులియడం మంచిదా? చెడ్డదా?
పులియడం (Fermentation) అనేది ఒక సహజమైన ప్రక్రియ. పెరుగు, ఇడ్లీ, దోసె పిండి లాంటివి పద్ధతి ప్రకారం పులిస్తే అది జీర్ణక్రియకు చాలా మంచిది. ఫ్రిజ్‌లో పెట్టిన తాజా గోధుమ పిండి కొద్దిగా పులిసినా ప్రమాదం లేదు.

ప్రమాదం ఎప్పుడు జరుగుతుంది 
పిండిని ఎక్కువ రోజులు ఉంచినా లేదా సరిగ్గా దాచకపోయినా అది విపరీతంగా పులిసిపోయి కీడు చేస్తుంది. ఇంకా పిండి బాగా పుల్లటి వాసన వస్తుంది. తాకితే  బంకగా మారుతుంది.  ఇటువంటి పిండితో రొట్టెలు చేసుకుని తినడం వల్ల కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం, అజీర్ణం వంటి కడుపునొప్పి సమస్యలు వస్తాయి.

పాలు, పెరుగు కలిపిన పిండి ఇంకా ప్రమాదం 
చాలా మంది చపాతీలు మెత్తగా రావడం కోసం నీళ్లకు బదులుగా పాలు, పెరుగు లేదా నెయ్యి వేసి పిండి కలుపుతారు. ఇలాంటి పిండి సాధారణ పిండి కంటే చాలా త్వరగా పాడైపోతుంది. ఎందుకంటే పాల పదార్థాలు చాలా వేగంగా విరిగిపోతాయి. అందుకే ఇలా కలిపిన పిండిని అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే వాడేయాలి.

డాక్టర్లు చెప్పే  సలహాలు, సింపుల్ రూల్స్: 
* పిండి కలపడం పూర్తి కాగానే, మిగిలిన భాగాన్ని వెంటనే మూతపెట్టి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. బయట ఉంచకూడదు.
*ఫ్రిజ్‌లో పెట్టి 24 గంటలు దాటిన పిండిని అస్సలు వాడకండి, పారేయండి.
*పిండి రంగు మారినా, పుల్లటి వాసన వచ్చినా, బూజు పట్టినా అస్సలు వాడొద్దు.

పిల్లలు, వృద్ధులు ఇంకా కడుపు సమస్యలు ఉన్నవారికి ఎప్పుడూ అప్పటికప్పుడు ఫ్రెష్ గా కలిపిన పిండితో చేసిన చపాతీలు/రొట్టెలు పెట్టడమే అత్యంత సురక్షితం. ఇవి సులువుగా అరిగి, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.