పెట్రోల్, డీజిల్ పై రూ.56 కోట్ల పన్ను వసూలు

పెట్రోల్, డీజిల్ పై రూ.56 కోట్ల పన్ను వసూలు

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ పై విపరీత మైన పన్నులు వేసి ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో కామెంట్ చేశారు. 2014 నుంచి 2021 వరకు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పేరుతో రాష్ట్రం ప్రభుత్వం రూ.56 వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందని అన్నారు. పెట్రోల్ పై 35.20, డీజిల్ పై 27 శాతం పన్నులతో దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రో చార్జీలు పెంచిందని అన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.