
వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Thripati).. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ రెండు పేర్లే వినిపిస్తున్నాయి. ఈ జంటకు జూన్ 9వ తేదీన ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వరుణ్, లావణ్య(Varun,lavanya marriage) జంట తమ పెళ్లి విషయాన్ని ప్రకటించి అందరికీ షాకిచ్చారు.
ఇక ఈ జంట ఎంగేజ్మెంట్ ఇప్పటికే జరగడంతో.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు బలంగా వినిపించాయి. అంతేకాదు ఆగస్టు నెలలోనే వీరి పెళ్లి ఉంటుందని, అది కూడా లండన్ లో జరగనుందనే వార్తలు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుణ్, లావణ్యల పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పేస్ బుక్, ఇన్స్టా, ట్విట్టర్, త్రేడ్ ఇలా ఎక్కడ చూసిన అదే న్యూస్ వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే.. వరుణ్, లావణ్యల పెళ్లి వాయిదా పడిందట. దీనికి కారణం తెలియదు కానీ.. గతే రెండు రోజులుగా ఎక్కడ చూసినా ఇదే న్యూస్ దర్శనమిస్తోంది. ఈ న్యూస్ చూసిన నెటిజన్స్.. అదేంటి మరి కొన్ని రోజుల్లో పెళ్లి జరగనుందని అనుకుంటున్న సమయంలో వాయిదా అనే వార్తలు వినిపిలుస్తున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఈ వార్తలపై ఇరు కుంటుంబాల నుండి ఎటువంటీ అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ గానీ, లావణ్య ఫ్యామిలీ గానీ ఎలా స్పదిస్తాయో చూడాలి.
ఇక వరుణ్, లావణ్యల సినిమాల విషయానికి వస్తే.. లావణ్య గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుండగా.. వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు(Pravin sattaru) దర్శకత్వంలో గాండీవధారి అర్జున(Gaandeevadhari Arjuna) అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.