
దులీప్ ట్రోఫీలో భాగంగా ఈస్ట్ జోన్ జట్టుకు షాక్ లు మీద షాకులు తగులుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి దూరమయ్యాడు. తాజాగా ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషాన్ ఈ డొమెస్టిక్ టోర్నీకి దూరం కావడంతో ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా టీమిండియా ఆసియా కప్ స్క్వాడ్ లో ఎంపికవుతాడనుకున్న కిషాన్ కు ఇది పెద్ద దెబ్బ. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పటికే గాయం కారణంగా ఆసియా కప్ కు దూరం కాగా.. సంజు శాంసన్ స్థానంలో రిజర్వ్ వికెట్ కీపర్ గా కిషాన్ ను సెలక్ట్ అవుతాడనుకున్నారు. అయితే గాయంతో కిషాన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.
జూన్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో చివరిసారిగా కిషాన్ నాటింగ్‌హామ్‌షైర్ తరపున ఆడాడు. కొద్ది రోజుల క్రితమే ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా నియమించారు. అయితే గాయం ఈ టీమిండియా వికెట్ కీపర్ కు బిగ్ షాక్ ఇచ్చింది. కిషాన్ స్థానంలో 20 ఏళ్ల ఆశీర్వాద్ స్వైన్‌ను ఎంపిక చేసినట్లు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ధృవీకరించింది. కిషన్ అందుబాటులో లేకపోవడంతో బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. 29 ఏళ్ల ఈశ్వరన్.. దాదాపు దశాబ్ద కాలంగా బెంగాల్ జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. 103 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 7,800 పరుగులు సాధించాడు.
►ALSO READ | Buchi Babu Trophy 2025: నేటి నుంచి బుచ్చిబాబు టోర్నమెంట్.. లైవ్ స్ట్రీమింగ్, షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవే
దేశవాళీ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడనున్నాయి. నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. ప్రారంభ మ్యాచ్‌లో నార్త్ జోన్ ఈస్ట్ జోన్‌తో తలపడుతుంది. సెంట్రల్ జోన్ క్వార్టర్ ఫైనల్స్‌లో నార్త్ ఈస్ట్ జోన్‌తో తలపడుతుంది. 2023లో చివరి జోనల్ ఎడిషన్‌లో ఫైనలిస్టులుగా నిలిచిన సౌత్ జోన్, వెస్ట్ జోన్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఈ టోర్నమెంట్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించబడుతుంది. సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు ఫైనల్ జరుగుతుంది.
దులీప్ ట్రోఫీకి ఈస్ట్ జోన్ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్, ఆశీర్వాద్ స్వైన్ (వికెట్ కీపర్), సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీదామ్ పాల్, శరణ్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ సింధు జైస్వాల్, ముఖేష్ కుమార్, ముఖ్తార్ హుస్సేన్, మహ్మద్ షమీ