నేషనల్ క్రికెట్ అకాడమీకి ఇషాన్ కిషన్.. ఎందుకో తెలుసా..?

నేషనల్ క్రికెట్ అకాడమీకి ఇషాన్ కిషన్.. ఎందుకో తెలుసా..?

జూలై నెలలో వెస్టిండీస్ లో టీమిండియా పర్యటించనుంది. జట్టును ప్రకటించకముందే... ఇషాన్ కిషన్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళుతున్నట్లు సమాచారం.

విండీస్ టూర్‌కు ముందు భారత వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తో పాటు మరికొందరు కూడా ఫిట్ నెస్ సాధించడం కోసం నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తున్నారని చెబుతున్నారు. వచ్చే వారం NCAలో చేరనున్నాడని, పూర్తి ఫిట్ నెస్ సాధించిన తర్వాతే వెస్టిండీస్ టూర్‌లో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. 

అంతర్జాతీయ సిరీస్‌ల మధ్య గ్యాప్ ఉన్నప్పుడల్లా భారత ఆటగాళ్లు ఫిట్‌నెస్ సాధించడం కోసం బెంగళూరులోని NCAకి వెళ్లడం అందరికీ తెలిసిందే.

ఇషాన్ కిష‌న్ దేశ‌వాళీ లీగ్ నుంచి వైదొలిగిన విష‌యం తెలిసిందే. వెస్టిండీస్ ప‌ర్యట‌న‌కు సిద్ధమ‌వుతున్న అత‌ను దులీప్ ట్రోఫీ నుంచి త‌ప్పుకున్నాడు. ప్రపంచ టెస్టు చాంపియ‌న్‌షిప్‌ ఫైన‌ల్లో (WTC Final 2023) బెంచ్‌కే ప‌రిమిత‌మైన ఇషాన్ కిషన్ విండీస్ గ‌డ్డపై ప‌రుగుల వ‌ర‌ద పారించేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నాడు.