
ఇండోర్: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. విజయ్ హజారే ట్రోపీలో సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 94 బాల్స్ లోనే 11 సిక్స్‌లు, 19 ఫోర్లతో 173 పరుగులు చేసి ఔరా అనిపించాడు. శనివారం ఎలైట్ గ్రూఫ్ బిలో మధ్యప్రదేశ్ , జార్ఖండ్ ల మధ్య లీగ్ మ్యచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఫస్ట్ 74 బాల్స్ లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 20 బాల్స్ లో 6 సిక్సర్లు, 7 ఫోర్లు బాది 71 రన్స తో ఈ జార్ఖండ్ కెప్టెన్ విధ్వంసం సృష్టించాడు. ఒక దశలో డబుల్ సెంచరీ కూడా సాధిస్తాడని భావించినా యదవ్ బౌలింగ్‌లో 27వ ఓవర్లో ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ ధాటికి జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 422 రన్స్ తో భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కు తోడుగా విరాట్ సింగ్ 68, సుమిత్ కుమార్ 52, అంకుల్ రాయ్(39 బాల్స్ లో 72 రన్స్) రాణించారు. తర్వాత 423 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ టీమ్ 18.4 ఓవర్లలోనే 98 రన్స్ చేసి కుప్పకూలింది.