
ఇస్రో ఛైర్మన్ శివన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-2 ప్రయోగం సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శంచుకున్నారు. చంద్రయాన్2 వాహకనౌక నమూనాకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రంగనాయకుల మండపంలో పండితులు శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. చంద్రయాన్2ను సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు ప్రయోగించనున్నట్లు తెలిపారు శివన్.