నింగిలోకి దూసుకెళ్లిన.. PSLV-C62 రాకెట్

నింగిలోకి దూసుకెళ్లిన..  PSLV-C62 రాకెట్

ఈ ఏడాది తొలి పీఎస్‌‌ఎల్వీ–సీ62 రాకెట్‌‌ను నింగిలోకి దూసుకెళ్లింది.  ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 1485 కేజీల ఉపగ్రహాన్ని  నింగిలోకి పంపింది ఇస్రో.

 ఈ ప్రయోగంలో ప్రధాన పేలోడ్ EOS-N1, దీనికి 'అన్వేష' అని పేరు పెట్టారు.  దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది.  ఇది అత్యాధునిక 'హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్' సాంకేతికత కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం.  సరిహద్దుల్లో శత్రువుల కదలికలను కనిపెట్టడం, దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం మరియు విపత్తు నిర్వహణలో ఇది కీలక సమాచారాన్ని అందిస్తుంది.

 ఈ రాకెట్ థాయ్‌‌లాండ్, బ్రిటన్ తయారు చేసిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌‌తో పాటు మరో 15 ఉపగ్రహాలను సన్‌‌–సింక్రోనస్ ఆర్బిట్‌‌లో ప్రవేశపెట్టింది. ప్రయోగ కేంద్రం నుంచి దూసుకెళ్లిన 17 నిమిషాల తర్వాత శాటిలైట్స్‌‌ను అంతరిక్షంలోకి చేర్చనుంది.