శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్స్ .. ఐటీ ఉద్యోగి అరెస్ట్

 శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్స్ .. ఐటీ ఉద్యోగి అరెస్ట్

శంషాబాద్ విమానాశ్రయానికి  పదే పదే పంపుతున్న బెదిరింపు మెయిల్స్ పంపుతున్న నిందితుడిని ఎయిర్ పోర్ట్  పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడిని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీగా గుర్తించారు.    కొవిడ్‌ వల్ల ఐటీ ఉద్యోగం పోయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు వైభవ్.

ఈ క్రమంలో గత కొంతకాలం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నాడు.  గతంలో రెండు సార్లు విమానాల్లో హైజాకర్లు వచ్చారని ఆర్జీఐఏకి మెయిల్స్ పంపాడు నిందితుడు.  ఆ మెయిల్స్‌ కార‌ణంగా పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు.  

ఆ మెయిల్ ను పరిశీలించగా ఇంటర్నేషనల్ డిపార్చర్ గేట్లు తెరవద్దని అందులో బాంబు పెట్టామని ఉంది. దానిని విమానాశ్రయం సిబ్బంది ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు.

అవి నకిలీవి అని తేలడంతో కేసు నమోదు చేసి బెంగళూరులో వైభవ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.   కాగా  పలుమార్లు   శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్స్, కాల్స్ వచ్చాయి.