
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మంత్రి కేటీఆర్ లెటర్
హైదరాబాద్ కు ITIR గానీ.. దానికి సమానమైన ప్రత్యేక పాలసీని గానీ ప్రకటించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్.. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లెటర్ రాశారు. గత ఆరేళ్లుగా హైదరాబాద్ సాధించిన ఐటీ, ఐటీ అనుబంధ ప్రగతిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు కన్నా ఎన్నో రెట్ల వృద్ధిని హైదరాబాద్ నమోదు చేస్తోందన్నారు. భారతదేశ ఆర్థిక ఇంజిన్లుగా హైదరాబాద్ లాంటి నగరాలు మారుతున్నాయన్నారు. ఐటీలో ప్రగతి సాధిస్తున్న నగరాలకు ప్రత్యేక పాలసీ ద్వారా కేంద్రం ప్రోత్సాహం అందించాలన్నారు. ITIRను కొనసాగించే ఉద్దేశంలో కేంద్రం లేదని అర్థమవుతోందన్నారు. హైదరాబాద్ కు ప్రత్యేక ఐటీ హోదా అందిస్తే తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.