తెలుగు వాళ్లకు అవార్డు రావడం సంతోషకరం

తెలుగు వాళ్లకు అవార్డు రావడం సంతోషకరం

హైదరాబాద్: తెలుగు వాళ్లకు అవార్డు రావడం సంతోషకరమని సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గరికపాటి నర్సింహారావు, డాక్టర్ సుంకర ఆదినారాయణ, దర్శనం మొగిలయ్యలు  ఎన్వీ రమణను కలిశారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ... పల్లె పాటలకు, కళలకు ప్రభుత్వం పట్టం కడుతోందన్నారు. పద్మ అవార్డులు ఒకప్పుడు ప్రముఖలకే దక్కేవని, కానీ నేడు అర్హులైన ప్రతి ఒక్కరికీ అవార్డులు వస్తున్నాయన్నారు. ఇది శుభసూచికమన్నారు. మొగిలయ్య, ఆదినారాయణ, గరికపాటి లాంటి వాళ్లు వివిధ రంగాల్లో సమాజం కోసం పాటుపడినందుకు ఫలితం దక్కిందన్నారు. వాళ్లను కలుసుకోవడం గర్వంగా ఉందన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

టార్గెట్ 2027: ఎమ్మెల్యేగా గెలుపు.. ఎంపీ పదవికి రాజీనామా

నేను ముత్యాల ముగ్గు హీరోయిన్.. రేవంత్ రెడ్డి విలన్