జూబ్లీహిల్స్ మజ్లిస్ ​అభ్యర్థిగా సయ్యదా ఫలక్!

జూబ్లీహిల్స్ మజ్లిస్ ​అభ్యర్థిగా సయ్యదా ఫలక్!

హైదరాబాద్, వెలుగు: జూబ్లీ హిల్స్​ నుంచి మజ్లిస్​ మొదటిసారిగా మహిళను అభ్యర్థిగా ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిసింది. పార్టీ చరిత్రలోనే మహిళను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దింపాలని భావిస్తున్నట్టు ఆపార్టీ వర్గాల సమాచారం. జాతీయ కరాటే చాంపియన్ సయ్యదా ఫలక్​ను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతుంది. 

తద్వారా మహిళా, మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.  3 ఏళ్ల కిందట​పార్టీలో చేరిన సయ్యదా ప్రజా సమస్యలపై కూడా పోరాడినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక క్రీడాకారుడిపై పోటీగా మరో క్రీడాకారిణిని బరిలోకి దించితే బాగుంటుందని మజ్లిస్​భావిస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే జూబ్లీహిల్స్ ఎన్నికల పోరు ఆసక్తి కరంగా మారుతుంది.