ఎల్బీనగర్ లోనే అత్యధికం.. కాసేపట్లో గుర్తులను కేటాయించనున్న ఈసీ

ఎల్బీనగర్ లోనే అత్యధికం.. కాసేపట్లో గుర్తులను కేటాయించనున్న ఈసీ
  • బరిలో 48 మంది అభ్యర్థులు
  • గజ్వేల్ లో 44, కామారెడ్డిలో 21 మంది
  • 119 సెగ్మెంట్లలో 2898 మంది క్యాండిడేట్స్
  • జాబితా విడుదల చేసిన ఎన్నికల కమిషన్
  • కాసేపట్లో గుర్తులను కేటాయించనున్న ఈసీ

హైదరాబాద్: ఈ నెల 30 న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఫైనల్ జాబితాను ఈసీ కాసేపటి క్రితం విడుదల చేసింది. అత్యధికంగా 48 మంది అభ్యర్థులు ఎల్బీ నగర్ నుంచి పోటీలో ఉన్నారని తెలిపింది. గజ్వేల్ లో 44 మంది, సిరిసిల్ల, సిద్దిపేటల్లో 21 మంది చొప్పున బరిలో నిలిచారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న మరో సెగ్మెంట్ కామారెడ్డిలో 21 మంది రంగంలో ఉన్నారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలో 33 మంది, రాష్ట్రంలోనే అతి పెద్ద శేరిలింగంపల్లి సెగ్మెంట్ నుంచి 31 మంది బరిలో ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 సెగ్మెంట్లలో కలిపి 2,898 మంది పోటీలో ఉన్నారని పేర్కొన్నది. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇవాళ గుర్తులను కేటాయించనున్నారు. జనసేన ఇక్కడ గుర్తింపు లేని పార్టీగా ఉంది. దీంతో ఆ పార్టీ పోటీ చేస్తున్న 8 సెగ్మెంట్లలో అభ్యర్థులకు ఏయే గుర్తులు వస్తాయో తేలనుంది.