
హార్ట్ పేషంట్ అయిన సోదరునితో వాకింగ్ కు వెళ్లిన ఓ మహిళను చిక్కడపల్లి పోలీసులు ఘోరంగా అవమానించారు. చిక్కడపల్లికి చెందిన ఓ మహిళ ఐటీ రంగంలో పనిచేస్తుంది. హర్ట్ పేషంట్ అయిన తన సోదరున్ని తీసుకొని ఆమె మార్నింగ్ వాకింగ్ కు వెళ్లింది. వారిని చిక్కడపల్లి పోలీసులు అడ్డుకున్నారు. తన సోదరుడు హార్ట్ పేషంట్ అని.. అందుకే అతనితో వాకింగ్ కు వచ్చినట్లు ఆమె తెలిపింది. అయినా సరే పోలీసులు వినకుండా.. ఆమెకు, సోదరునితో అక్రమసంబంధం అంటగట్టారు. మాటామాటా పెరగడంతో.. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించారని వారిరువురిపై కేసు నమోదు చేశారు. ఈ గొడవ గురించి పోలీసులను ప్రశ్నించిన ఆమె తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు. దాంతో ఆ మహిళ హెచ్ఆర్సీని ఆశ్రయించి.. చిక్కడపల్లి పోలీసులపై ఫిర్యాదు చేసింది.
ఇదే విషయంపై స్పందించిన హెచ్ఆర్సీ.. నిష్పక్షపాతంగా విచారణ జరిపి రిపోర్టు దాఖలు చేయాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది. ఈ కేసును మే 31 వరకు హెచ్ఆర్సీ వాయిదా వేసింది.