మేం పని చేసింది ఆరున్నరేండ్లే: మంత్రి కేటీఆర్

మేం పని చేసింది ఆరున్నరేండ్లే: మంత్రి కేటీఆర్
  •  మిగతా కాలం కరోనా ఆగం చేసింది
  • దుర్మార్గపు కేంద్రం అప్పు పుట్టనియ్యలే
  • కాళేశ్వరం అంటే ఒకటి రెండు పిల్లర్లు కాదు
  • ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తాము పనిచేసింది కేవలం ఆరున్నరేండ్లు మాత్రమేనని ఐటీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మిగతా కాలంలో కరోనా ప్రపంచాన్నే ఆగం చేసిందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన అభివృద్దిపై మంత్రి కేటీఆర్ ఇవాళ బేగంపేటలోని ఓ హోటల్ లో పవర్ పాయంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును అర్థం చేసుకోకుండా కొందరు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అంటే ఒకటి రెండు పిల్లర్లు కాదని, పిల్ల కాలువలు పూర్తయితే 45 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పారు. అంతకు ముందు కట్టిన ధవళేవ్వరం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీల్లోనూ వాటర్ లీకేజీలు ఏర్పడ్డాయని చెప్పారు.

అలాగే కాళేశ్వరం సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఖర్చులన్నీ నిర్మాణ సంస్థే భరించుకుంటుందని చెప్పారు. ఎలక్షన్ టైంలో కావాలనే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయన్నారు.