హైదరాబాద్లో ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్

హైదరాబాద్లో ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ రైడ్స్

హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి ఐటీ సోదాలు జరిగాయి. మంగళవారం ఉదయం నుంచే ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్పై ఐటీ సోదాలు చేయడం గమనార్హం. ఐటీ అధికారులు 15 చోట్ల సోదాలు నిర్వహిస్తుండటంతో హైదరాబాద్లో ఐటీ సోదాలు చర్చనీయాంశంగా మారాయి.

గత నెలలో.. గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రం సమీపంలోని వీ కేర్‌ సీడ్స్‌‌‌, కోల్డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజీ, ప్రాసెసింగ్‌‌‌ యూనిట్లలో ఐటీ ఆఫీసర్ల తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. కోల్డ్‌ స్టోరేజీల ద్వారా భారీ మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు ప్రచారం కావడంతో స్పందించిన ఐటీ ఆఫీసర్లు పలు కోల్డ్‌ స్టోరేజీలపై దాడులు చేశారు. ఈ క్రమంలో వీ కేర్‌‌‌‌‌‌‌‌ కోల్డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్, గోడౌన్‌‌‌‌‌‌‌‌లో నిల్వఉన్న ధాన్యం స్టాక్ రిజిస్టర్లు, పంటల వివరాలను పరిశీలించి పలు వివరాలను సేకరించారు. 

సికింద్రాబాద్​మానేపల్లి జ్యువెలర్స్లో ఐటీ అధికారులు అక్టోబర్లో సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు దుకాణంలోని పలు డాక్యుమెంట్లు పరిశీలించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నా యన్న ఫిర్యాదుల మేరకు ఐటీ అధికారులు సోదాలను నిర్వహించారు.