గద్దర్ పార్టీ జెండా ఇదే!! 3 రంగులు.. మధ్యలో పిడికిలి

గద్దర్ పార్టీ జెండా ఇదే!! 3 రంగులు.. మధ్యలో పిడికిలి

గద్దర్ పార్టీ జెండా ఇదే!!
3 రంగులు.. మధ్యలో పిడికిలి
‌అధ్యక్షుడిగా గద్దర్, సెక్రటరీగా నరేశ్​
కోశాధికారి బాధ్యతల్లో గద్దర్ సతీమణి

హైదరాబాద్ : గద్దర్ ప్రజా పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అందులో ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగులు ఉండనున్నట్టుగా సమాచారం. జెండా మధ్యలో పిడికిలి గుర్తును పెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా గద్దర్, కార్యదర్శిగా నరేష్, కోశాధికారిగా గద్దర్ భార్య నాగలక్ష్మి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

నెల రోజుల్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికానుంది. ఆ తర్వాత గద్దర్‌ ప్రజా పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. అయితే ఎన్నికల గుర్తు ఏం ఉంటుందనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.