CEC జ్ఞానేశ్ కుమార్ ను తొలగించేవరకు మా పోరాటం ఆగదు: మంత్రులు 

CEC జ్ఞానేశ్ కుమార్ ను తొలగించేవరకు మా పోరాటం ఆగదు: మంత్రులు 

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను పదవి నుంచి తొలగించేవరకు నిరసనలు ఆగవని అన్నారు. 

కాంగ్రెస్ అధికారంలో లేని ఇతర రాష్ట్రాల్లో కూడా ఆందోళన చేపడతామని.. దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తిస్తామని అన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని..సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేసేవరకు పోరాడతామని అన్నారు. ఈ ఆందోళన ఆరంభం మాత్రమేనని అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..

స్వయంప్రతిపత్తి గల సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని బీజేపీ అనుబంధ సంస్థలాగా మార్చిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం. వోట్ చోరీపై రాహుల్ గాంధీ పోరాడుతున్నారని... ప్రజాస్వామ్యాన్ని మోడీ, అమిత్ షా ఖూనీ చేస్తున్నారని అన్నారు మంత్రి పొన్నం.

మంత్రి జూపల్లి మాట్లాడుతూ..

దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోడీ, అమిత్ షా ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.