పాక్ సూపర్ లీగ్ 12వ సీజన్ షెడ్యూల్ ఫిక్స్: మార్చి 18 నుంచి మే 2 వరకు టోర్నీ.. జరిగే మార్పులు ఇవే!

పాక్ సూపర్ లీగ్ 12వ సీజన్ షెడ్యూల్ ఫిక్స్: మార్చి 18 నుంచి మే 2 వరకు టోర్నీ.. జరిగే మార్పులు ఇవే!

PSL 2027: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) తదుపరి సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. పీఎస్‌ఎల్ 12వ ఎడిషన్ వచ్చే ఏడాది మార్చి 18 నుంచి మే 2 వరకు జరగనుంది. వరుసగా రెండో సీజన్‌గా ఈ టోర్నీ ఎనిమిది జట్లతో కూడిన విస్తరించిన ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.

లండన్ లో మీటింగ్.. డేట్స్ ఫిక్స్: 

* సెప్టెంబర్ 1న లండన్‌లో జరిగిన పీఎస్‌ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ తేదీలను ఫిక్స్ చేశారు. ఎనిమిది ఫ్రాంచైజీల యజమానులు, ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

* పీఎస్‌ఎల్ 11 నుంచి ఎనిమిది జట్ల ఫార్మాట్‌ను ప్రవేశపెట్టగా, అదే సమయంలో డ్రాఫ్ట్ సిస్టమ్‌కు స్వస్తి పలికి తొలిసారిగా ప్లేయర్స్ ఆక్షన్ (వేలం) విధానాన్ని తీసుకొచ్చారు.

* గడ్డఫీ స్టేడియంలో జరిగిన గత సీజన్ ఫైనల్‌లో పెషావర్ జల్మీ జట్టు.. హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ను ఓడించి తొమ్మిదేళ్ల నిరీక్షకు తెరదించుతూ టైటిల్ కైవసం చేసుకుంది.

త్వరలోనే ప్లేయర్స్ ఆక్షన్:  

* పీఎస్‌ఎల్ 12 షెడ్యూల్ ప్రకటన వెలువడటంతో.. ఇక డైరెక్ట్ సైనింగ్స్, రిటెన్షన్ ప్రకటనలు, ట్రేడ్ విండో, ఆటగాళ్ల వేలం (Players Auction) లాంటి కీలక కార్యక్రమాలకు త్వరలోనే తెరలేవనుంది. ఈ సందర్భంగా పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) మాట్లాడుతూ.. పీఎస్‌ఎల్ 11 ఈ లీగ్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. రికార్డు స్థాయి జనసందోహం, బ్రాడ్‌కాస్ట్‌లతో టోర్నీ అదరగొట్టింది. పీఎస్‌ఎల్ 12 అత్యున్నత ఉన్నత ప్రమాణాలతో కొనసాగుతుందని పేర్కొన్నారు. టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 

బరిలో నిలిచే 8 జట్లు ఇవే: 

* హైదరాబాద్ కింగ్స్‌మెన్ (Hyderabad Kingsmen)

* ఇస్లామాబాద్ యునైటెడ్ (Islamabad United)

* కరాచీ కింగ్స్ (Karachi Kings)

* లాహోర్ ఖలందర్స్ (Lahore Qalandars)

* ముల్తాన్ సుల్తాన్స్ (Multan Sultans)

* పెషావర్ జల్మీ (Peshawar Zalmi)

* క్వెట్టా గ్లాడియేటర్స్ (Quetta Gladiators)

* రావల్పిండి (Rawalpindi)