కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది కోహ్లీ సొంత నిర్ణయం

కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది కోహ్లీ సొంత నిర్ణయం

T20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు BCCI అధ్యక్షుడు గంగూలీ. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనేది కోహ్లీ సొంత నిర్ణయమని అన్నారు. BCCI ఒత్తిడి కారణంగా ఆయన కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం లేదన్నారు. కోహ్లీ తీసుకున్న నిర్ణయం వెనుకున్న కారణాలను తాను అర్థం చేసుకోగలనని అన్నారు.

అయినా.. మూడు T20 ఫార్మాట్లకు భారత జట్టుకు సుదీర్ఘకాలం నాయకత్వం వహించడం అంత సులభం కాదని చెప్పారు గంగూలీ. గతంలో తనతో సహా ఇతర కెప్టెన్లందరూ ఇలాంటి పరిస్థితులను చూసిన వారేనని అన్నారు.  టీ20 వరల్డ్ కప్  తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ ప్రకటించాడు. టీ20 ఫార్మాట్లో తాను బ్యాట్స్ మెన్ గానే కొనసాగుతానని చెప్పాడు.

మరిన్ని వార్తలు