కాసేపట్లో కర్నాటక సీఎం ప్రకటన

కాసేపట్లో కర్నాటక సీఎం ప్రకటన

కర్నాటక రాజకీయం ఢిల్లీలో హైటెన్షన్ పెంచుతోంది. సీఎం అభ్యర్థి ఎవరానేదానిపై కాసేపట్లో తేలనుంది. కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యనా..? లేక డీకే శివకుమారా..? అనే దానిపై క్లారిటీ రానుంది. గత రెండు రోజులుగా ఢిల్లీలో చర్చలు కొనసాగుతున్నాయి. పలు దఫాలుగా సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ తోనూ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు చర్చించారు. అయితే.. సీఎం ఎవరన్న దానిపై మాత్రం ఇంకా చిక్కుముడి వీడడం లేదు. ప్రస్తుతం హైకమాండ్ చేతిలోనే ఉంది. రాహుల్ నిర్ణయం ప్రకారమే సీఎం ఎవరనేది తేలనుంది. రాహుల్ గాంధీ చేతిలో సీల్డ్ కవర్ ఉంది.

కర్నాటక సీఎం పదవిపై సస్పెన్స్ కొనసాగుతున్న వేళ ఢిల్లీలో రాహుల్ గాంధీని సిద్దరామయ్య, డీకే శివకుమార్ కలవనున్నారు. అయితే.. ఈ ఇద్దరూ విడివిడిడి కలుస్తారా..? లేక కలిసే భేటీ అవుతారా..? అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇద్దరు కూడా సీఎం పదవిని తనకే ఇవ్వాలంటే తనకే ఇవ్వాలని పట్టుపడుతుండడంతో అధిష్టానానికి సమస్య సంక్షిష్టంగా మారింది. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే డీకే ప్రకటించారు. మరోవైపు.. మల్లికార్జున ఖర్గే.. సోనియాగాంధీతో చర్చించి.. నిర్ణయాన్ని ఫైనల్ చేయనున్నారు. 

మరోవైపు.. కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి మాత్రం ముహూర్తాన్ని ఖరారు చేశారు. మే 18వ తేదీ గురువారం రోజు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని చెబుతున్నారు.