
2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ పొట్టి సమరానికి ఇప్పటికే 13 జట్లు నేరుగా అర్హత సాధించగా.. యూరప్ క్వాలిఫైయర్ ద్వారా ఇటలీ, నెదర్లాండ్స్ అర్హత సాధించాయి. ఇటలీతో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ విజయం సాధించి వరల్డ్ కప్ కు బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మరోవైపు నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇటలీ ఓడిపోయినా నెట్ రన్ రేట్ తో ఈ మెగా ఈవెంట్ కు క్వాలిఫై అయింది. దీంతో 2026 వరల్డ్ కప్ కు 20 జట్లలో ఇప్పటివరకు 15 జట్లు అర్హత సాధించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
— Sportskeeda (@Sportskeeda) July 11, 2025
𝐈𝐭𝐚𝐥𝐲 𝐚𝐧𝐝 𝐭𝐡𝐞 𝐍𝐞𝐭𝐡𝐞𝐫𝐥𝐚𝐧𝐝𝐬 𝐪𝐮𝐚𝐥𝐢𝐟𝐲 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐓𝟐𝟎 𝐖𝐨𝐫𝐥𝐝 𝐂𝐮𝐩 𝟐𝟎𝟐𝟔! 🏆🇮🇹🇳🇱
A historic moment for Italy, who will feature in their first-ever World Cup, while it’s heartbreak for Jersey, who narrowly miss out on… pic.twitter.com/5xVZRvKAj4
ఆతిధ్య దేశాలైన భారత్, శ్రీలంక నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధిస్తాయి. 2024 టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కు అర్హత సాధించిన దేశాలు 2026 వరల్డ్ కప్ కు తమ బెర్త్ లు ఖాయం చేసుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, యూఎస్‌ఏ, వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఈ లిస్టులో ఉన్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ సూపర్ 8 కు అర్హత సాధించకపోయినా ర్యాంకింగ్స్ పరంగా అర్హత సాధించాయి. దీంతో 20 జట్లలో క్వాలిఫై మ్యాచ్ లు ఆడకుండానే ఈ 12 టీమ్స్ 2026 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి.
ఇటీవలే కెనడా కూడా అర్హత సాధించి 13 వ జట్టుగా నిలిచింది. ఇటలీ, నెదర్లాండ్స్ తో 15 జట్లు ఫిక్స్ అయ్యాయి. మిగిలిన 5 స్థానాల కోసం ఈస్ట్ ఏసియా పసిఫిక్ క్వాలిఫైయర్స్ నుంచి ఒక టీమ్, ఆసియా క్వాలిఫైయర్స్ నుంచి రెండు టీమ్స్, ఆఫ్రికా క్వాలిఫైయర్స్ టోర్నీ నుంచి రెండు టీమ్స్ అర్హత సాధించాల్సి ఉంది. 2026లో టీ20 తొలిసారి జట్లు టీ 20 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి.
ALSO READ : IND vs ENG 2025: లార్డ్స్‌లో టీమిండియా రన్స్ కొట్టలేదు.. కానీ ఆ ఒక్కడిని ఆపడం కష్టం: రూట్
Netherlands and Italy qualify from Europe, leaving five spots up for grabs for ICC Men's #T20WorldCup 2026 👀
— ICC (@ICC) July 12, 2025
➡️ https://t.co/rdTHHVs76D pic.twitter.com/8VAJW3hdP4
2007లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పొట్టి సమరాన్ని రెండేళ్ల కొకసారి నిర్వహిస్తూ వస్తున్నారు. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడడం తప్పితే ప్రతి రెండు సంవత్సరాలకు ఐసీసీ ఈ టోర్నీ నిర్వహిస్తూ వస్తుంది. 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022, 2024లో టీ20 వరల్డ్ కప్ జరిగింది. గత ఏడాది జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకుంది. వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా ముగిసిన ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.