
లార్డ్స్ వేదికగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కొంచెం ఇంగ్లాండ్ జట్టు పై చేయి సాధించినట్టు కనిపిస్తుంది. మూడో రోజు బాగా ఆడిన జట్టుకే గెలుపు అవకాశాలు ఉంటాయి. తొలి రెండు టెస్టులతో పోలిస్తే మూడో టెస్టులో పిచ్ బ్యాటింగ్ కు మరీ అంత అనుకూలంగా ఏమీ లేదు. రెండో రోజు పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది. మూడో రోజు సైతం బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ రూట్ చెబుతున్నాడు. రెండో రోజు ముగిసిన తర్వాత మూడో రోజు పిచ్ పై ఒక క్లారిటీ ఇచ్చాడు.
రూట్ మాట్లాడుతూ "మూడో రోజు టీమిండియా పరుగులు చేయడం చాలా కష్టం. కానీ రిషబ్ పంత్ తనదైన శైలిలో ఆడతాడు. రిస్క్ తీసుకొని టీమిండియాకు పరుగులు చేయగలడు". అని రూట్ అన్నాడు. గిల్, జైశ్వాల్, కరుణ్ నాయర్ అవుట్ కావడంతో ఇప్పుడు టీమిండియాకు ఆదుకునే బాధ్యత రాహుల్, రిషబ్ పంత్ లపై పడింది. నితీష్ రెడ్డి, జడేజా, సుందర్ రూపంలో టీమిండియా బ్యాటింగ్ డెప్త్ బాగానే ఉంది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 50 నుంచి 70 పరుగులు ఆధిక్యం సాధిస్తేనే ఈ మ్యాచ్ పై గిల్ సేన పట్టు సాధించవచ్చు.
ALSO READ : ఎడమ వైపు ఎక్కువగా వాలిపోతున్నా.. ఆటలో లోపాలను ఒప్పుకున్న గోల్డెన్ బాయ్ నీరజ్
శుక్రవారం (జూలై 11) రెండో రోజు అట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 145/3 స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (53 బ్యాటింగ్) ఫిఫ్టీతో రాణించాడు. కరుణ్ నాయర్ (40) ఫర్వాలేదనిపించాడు. ఇన్‌ఫామ్ బ్యాటర్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (16), యశస్వి జైస్వాల్ (13) ఫెయిలయ్యారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 251/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112.3 ఓవర్లలో 387 రన్స్‌కు ఆలౌటైంది. జో రూట్ (104) సెంచరీ పూర్తి చేసుకోగా.. బ్రైడన్ కార్స్ (56), జేమీ స్మిత్ (51) ఫిఫ్టీలతో రాణించారు. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ (2/85) రెండు వికెట్లు తీశాడు.
Joe Root said, "it'll be difficult for India to score, but Rishabh Pant will do his way. Taking the risk and scoring". (Sky Sports). pic.twitter.com/Isz7CAbIue
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2025