బియాస్ నదిలో కొనసాగుతున్న గాలింపు

బియాస్ నదిలో కొనసాగుతున్న గాలింపు

బియాస్ నదిలో కారు కొట్టుకుపోయిన ఘటనలో గల్లంతైనవారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒకవైపు నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ఐటీబీపీ సిబ్బంది ప్రాణాలకు తెగించి మరీ కారు చిక్కుకున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఐటీబీపీకి  ఏఎస్సై సునీల్ కుమార్ కారు వద్దకు చేరుకుని అందులో ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అని పరిశీలించారు. అయితే ఎవరూ లేకపోవడంతో వెనుదిగిరిగారు. ప్రస్తుతం కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. 
 

బుధవారం చండీఘడ్ మనాలి హైవేపై వెళ్తున్న కారు ప్రమాదవశాత్తూ బియాస్ నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒకరిని రక్షించిన ఐటీబీపీ సిబ్బంది కులు హాస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.