లైసెన్స్, రిజిస్ట్రేషన్ లు తప్పనిసరి : ఐటీడీఏ పీవో రాహుల్

 లైసెన్స్, రిజిస్ట్రేషన్ లు తప్పనిసరి : ఐటీడీఏ పీవో  రాహుల్

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం, పరిసర ప్రాంతాల్లో పెద్ద స్థాయి వ్యాపారం నుంచి చిన్నస్థాయి వ్యాపారం చేసుకుంటున్న ప్రతీ ఒక్కరూ వ్యాపారాన్ని బట్టి లైసెన్స్, రిజిస్ట్రేషన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ అన్నారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఆధ్వర్యంలో గురువారం ఐటీడీఏలో నిర్వహించిన రిజిస్ట్రేషన్​ మేళా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 

వ్యాపారులకు లైసెన్స్, రిజిస్ట్రేషన్లు అందించిన అనంతరం పీవో మాట్లాడారు. ఎఫ్​ఎస్​ఎస్​ఐ ద్వారా ఫుడ్​ సేఫ్టీ అథారిటీ లైసెన్స్ మంజూరు అవుతుందన్నారు. లైసెన్స్ ఉంటే వ్యక్తిగత రుణాలు పొందడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు.  కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్​ తదితరులు పాల్గొన్నారు.