పెగాసస్‌ను కేంద్రమే కొనుగోలు చేసింది

పెగాసస్‌ను కేంద్రమే కొనుగోలు చేసింది

పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్రం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పెగాసస్ స్పైవేర్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని రాహుల్ ఆరోపించారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని రాహుల్ మండిపడ్డారు. పెగాసస్‌కు బాధ్యత వహిస్తూ.. హోంమంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షనలో జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలన్నారు. పెగాసస్‌ను ఇజ్రాయెల్ ఆయుధంగా గుర్తించిందని.. ఆయుధాలను ఉగ్రవాదులపై వాడాలి కానీ... మోడీ, అమిత్ షాలు దేశంపైనే వాడుతున్నారని రాహుల్ ఆరోపించారు.