రూల్స్ పట్టించుకోని ఇవాంక

రూల్స్ పట్టించుకోని ఇవాంక

న్యూయార్క్ : అమెరికాలో కరోనా నివారణకు స్ట్రిక్ట్ గా ఆంక్షలు విధించినప్పటికీ వాటిని అధ్యక్షుడి కూతురు ఇవాంకనే బ్రేక్ చేశారు. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ లో కరోనాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన హాట్ స్పాట్ కు వెళ్లారు. ఇక్కడ కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతుండటంతో ఈ ప్రాంతాన్ని హాట్ స్పాట్ గా ప్రకటించారు. రూల్స్ ప్రకారం ఈ ప్రాంతంలోకి బయట నుంచి ఎవరు రావొద్దు. కానీ యూదుల పండుగ పాసోవర్ లో పాల్గొనేందుకు ఇవాంక ఫ్యామిలో కలిసి కొన్ని రోజుల క్రితమే ఇక్కడకు వచ్చారు. ఈ విషయాన్ని వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. బెడ్ మినిస్టర్ లో జరిగిన పోసోవర్ వేడుకల్లో ఇవాంక పాల్గొన్నారు. ఐతే ఆమె ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రసుత్తం ఇవాంకా న్యూయార్క్ నుంచే విధులు నిర్వహిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఐతే అమెరికాలో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నందున ప్రజలంతా ఇంట్లోనే ఉండాలంటూ ఇవాంక పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అలాంటిదే ఆమె రూల్స్ బ్రేక్ చేయటంతో ఇవాంక తీరుపై విమర్శలు వస్తున్నాయి.