జనగామ అర్బన్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగులకు చెందిన మర్ల మౌనిక రమేశ్దంపతులు 8 ఏండ్లుగా సంతానలేమితో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మౌనికకు ప్రెగ్నెన్సీ వచ్చింది.
ఆమె జనగామలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ నెల 21న ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ స్వప్న లింగమూర్తి తెలిపారు. మౌనికను శనివారం డిశ్చార్జ్ చేసినట్లు పేర్కొన్నారు.
