నేనిప్పుడు తాబేలునే కుందేలును కాదు : హార్దిక్‌‌ పాండ్యా

నేనిప్పుడు తాబేలునే కుందేలును కాదు :  హార్దిక్‌‌ పాండ్యా

బ్రిడ్జ్‌‌టౌన్‌‌: బౌలింగ్‌‌ విషయంలో ప్రస్తుతానికి తాను తాబేలునే అని టీమిండియా ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా అన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుందేలును మాత్రం కాదని స్పష్టం చేశాడు. భుజం, వెన్ను నొప్పి నుంచి కోలుకున్న తాను క్రమంగా బౌలింగ్‌‌ వర్క్‌‌లోడ్‌‌ను పెంచుకుంటున్నానని తెలిపాడు. విండీస్‌‌తో తొలి వన్డేలో మూడు ఓవర్లు మాత్రమే వేసిన పాండ్యా ఓ వికెట్‌‌ తీసి 17 రన్స్‌‌ ఇచ్చాడు. 

రెండో వన్డేలో మాత్రం 6.4 ఓవర్లలో 38 రన్స్‌‌ ఇచ్చుకున్నాడు. గాయాల కారణంగా లిమిటెడ్‌‌ ఓవర్స్‌‌ క్రికెట్‌‌ను చాలా తక్కువగా ఆడుతున్నానని పాండ్యా వెల్లడించాడు. ‘ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. వరల్డ్‌‌ కప్‌‌ వరకు మరిన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌‌ చేసేలా రెడీ కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను తాబేలునే, కుందేలును మాత్రం కాదు. మెగా ఈవెంట్‌‌ వరకు అన్ని అనుకున్నట్లుగా జరుగుతాయని ఆశిస్తున్నా’ అని రెండో వన్డే తర్వాత పాండ్యా వ్యాఖ్యానించాడు. 

ప్రస్తుతానికి సిరీస్‌‌ 1–1గా ఉండటంతో మూడో మ్యాచ్‌‌పై ఉత్కంఠ పెరిగిందన్నాడు. రెండు జట్లకు, ఫ్యాన్స్‌‌కు ఈ మ్యాచ్‌‌ మరింత ఆసక్తిని కలిగిస్తుందన్నాడు.