ఇద్దరు హైబ్రిడ్ LeT ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

ఇద్దరు హైబ్రిడ్ LeT ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న క్రమంలో పోలీసులు తనిఖీలు వేగవంతం చేశార. జమ్మూవోని ఆజాద్‌గంజ్ బారాముల్లాలో చేసిన పోలీసుల తనిఖీల్లో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) సంస్థకు చెందిన ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. దాంతో పాటు వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై UA (P) చట్టం & ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. బారాముల్లాలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్న ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం మేరకు, బారాముల్లా పోలీస్, CRPF & ఆర్మీ సంయుక్త దళాలు ఆజాద్‌గంజ్ ఓల్డ్ టౌన్ బారాముల్లా వద్ద మొబైల్ వెహికల్ చెక్ పోస్ట్‌లను (MVCP) ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలోనే ఇద్దరు అరెస్టు అయ్యారు.

 ఆజాద్‌గంజ్ బారాముల్లా వైపు వస్తున్న ఇద్దరు అనుమానిత వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. అంతలోనే అలర్ట్ అయిన సిబ్బంది.. వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో వారి నుంచి 1 పిస్టల్, 1 పిస్టల్ మ్యాగజైన్, 4 లైవ్ పిస్టల్ రౌండ్లు, 1 గ్రెనేడ్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్న ఉగ్రవాదులను బారాముల్లాకు చెందిన ఫైసల్ మజీద్ గనీ, నూరుల్ కమ్రాన్ గానీగా గుర్తించారు.
     
ఈ ఇద్దరు వ్యక్తులు హైబ్రిడ్ ఉగ్రవాదులని, LeT సంస్థకు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థతో అనుబంధంగా ఉన్నారని ప్రాథమిక దర్యాప్తులో తెలింది. మరికొన్ని రోజుల్లో దేశంలో ప్రారంభం కానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని బారాముల్లాలో ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగంగా వారు ఈ ఆయుధాలు & మందుగుండు సామగ్రిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది.