
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న 5,485 మంది వీఆర్వోల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించనందున విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వీఆర్వోల జేఏసీ ప్రకటించింది. వీఆర్వోలను ఇతర శాఖల్లో కలపాలనే ప్రతిపాదనతో పాటు ఇతర అంశాలపై తమతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో వాసవి భవన్‌లో జరిగిన తెలంగాణ వీఆర్వోల జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశం చైర్మన్ గోల్కొండ సతీశ్ అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ, వీఆర్వోల వ్యవస్థ రద్దయి 23 నెలలు గడుస్తున్నా, సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. 2019లో అపాయింట్ అయిన వీఆర్వోల ప్రొహిబిషన్‌ను ఇంకా డిక్లేర్ చేయలేదని గుర్తుచేశారు. వీఆర్వోలను ఇతర శాఖల్లో బదిలీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు తీవ్ర జరుగుతుందన్నారు.