Ravindra Jadeja : రెండు పదాల ట్వీట్.. చెన్నై అభిమానులు ఖుష్

Ravindra Jadeja : రెండు పదాల ట్వీట్.. చెన్నై అభిమానులు ఖుష్

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు గతేడాది సెప్లెంబర్ లో జరిగిన ఆసియా కప్ లో మోకాలికి గాయమైంది. దాంతో 5 నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న జడ్డూ.. ప్రాక్టీస్ కోసం రంజీ ట్రోఫీలో ఆడేందుకు చైన్నై వచ్చాడు. సౌరాష్ట్ర తరుపున తమిళనాడుతో చివరి రౌండ్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ క్రమంలో ‘వణక్కం చెన్నై’ (నమస్కారం చెన్నై) అంటూ పెట్టిన ట్వీట్ అభిమానుల్ని సంతోషపెట్టింది. 

గత కొంతకాలంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జడేజాకు విభేదాలున్న విషయం తెలిసిందే. ఈ కారణంతో ‘జడ్డూ సీఎస్కేని వీడతాడు’ అనే వార్తలు వచ్చాయి. వాటన్నింటిని పక్కనబెట్టి జడేజాను సీఎస్కే రిటైన్ చేసుకుంది. అయితే, ప్రస్తుతం చెన్నై అభిమానుల్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ట్వీట్ కి స్పందించిన ఫ్యాన్స్ ‘వెల్ కమ్ బ్యాక్ సూపర్ కింగ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.