కవితకు క్లీన్‌‌ చిట్..బీజేపీ పోలిటికల్‌‌ గేమ్‌‌ : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

కవితకు క్లీన్‌‌ చిట్..బీజేపీ పోలిటికల్‌‌ గేమ్‌‌ : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
  • జగ్గారెడ్డి విమర్శ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్‌‌ స్కామ్ కేసులో కవితకు సీబీఐ స్పెషల్ కోర్టు క్లీన్‌‌ చిట్‌‌ ఇవ్వడం బీజేపీ పొలిటికల్​ గేమ్‌‌ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ‘బీజేపీ అవసరానికి ఒక తీరు.. అవసరం లేకపోతే ఒక తీరుగా ఉంటుంది. శత్రువు మిత్రుడు కావచ్చు. లేదంటే మిత్రుడు శత్రువూ కావచ్చు. బీజేపీనే లిక్కర్‌‌ స్కామ్ గురించి మొదట మాట్లాడింది. కానీ.. ఇపుడు క్లీన్‌‌ చిట్‌‌ ఇచ్చింది. 

మీరే స్కామ్ అన్నారు.. మీరే క్లీన్‌‌ చిట్‌‌ ఇచ్చారు’అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జగ్గారెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం వీహెచ్, జెట్టి కుసుమకుమార్‌‌ పేర్లు పరిశీలించాలని హైకమాండ్ ను విజ్ఞప్తి చేశానన్నారు.