- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సదాశివపేట, వెలుగు: సదాశివపేట పట్టణంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమవారం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతీ వార్డులో రూ.8 కోట్లతో అభివృద్ధి చేయడంతో పాటు వార్డులో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. సిద్దాపూర్ కాలనీలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌ను యధావిధిగా నూతన భవణం నిర్మించడానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తన దగ్గరకు పంపిస్తే పట్టణ అభివృద్ధిని తాను చూసుకుంటానన్నారు. మాట మీద నిలబడే వ్యక్తి జగ్గారెడ్డి అని మాట ఇస్తే చేసి తీరుతానన్నారు. సదాశివపేటలో సర్టిఫికెట్లు ఉన్న 5500 మందితో పాటు ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయిస్తానన్నారు.
