రాజకీయ లబ్ధి కోసమే మంత్రుల ఢిల్లీ పర్యటన

 రాజకీయ లబ్ధి కోసమే మంత్రుల ఢిల్లీ పర్యటన

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా.. సమస్యలు అలాగే ఉన్నాయన్నారు  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకున్నాం.. కానీ స్వయం పాలనలో కూడా  రైతులు రోడ్ల వెంట పడుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు జగ్గారెడ్డి. రాజకీయంగా కాంగ్రెస్ లో లాభం లేకున్నా..ప్రజల కోసం రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని తెలిపారు. 

రైతులు ఎండల్లో ఎండుతుంటే.. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఏసీలో ఉంటున్నారని ఆరోపించారు జగ్గారెడ్డి. ఆహార భద్రత కల్పించాలని అప్పటి ప్రధాని నెహ్రూ  FCI ద్వారా ధాన్యం కొనాలని ఏర్పాటు చేశారని అన్నారు. అప్పటి నుండి UPIఅధికారంలో ఉన్నప్పటి వరకు ధాన్యం కొనుగోళ్ల విషయంలో సమస్య రాలేదన్నారు. వడ్లు కొనకపోడం అనేది BJP,TRS నేతలు సృష్టించిన సమస్యేనని అరోపించారు. రైతులు రోడ్డున పడటానికి వీరే కారణమన్నారు. రాష్ట్ర పతి ఎన్నికల్లో బీజేపీ చెప్పినట్లు  TRS నేతలు బీజేపీకే ఓటేశారని.. అలాంటిది  రైతులు రోడ్ల మీద పడుతుంటే.. ప్రధాని ఒప్పించి వడ్లు కొనేలా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. బీజేపీ తో విందులు చేసుకుంటారు ..కానీ ధాన్యం మాత్రం కొనుగోలు చేసేలా చేయడం లేదని అన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసం మాత్రమే టీఆర్ఎస్ నాయకులు కుస్తీలు పడుతున్నారని తెలిపారు. 


 వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని..  BJP,TRS నేతలే సమస్యను సృష్టించి.. పరిష్కారం కోసం కొట్లడుతుంది కూడా వాళ్ళేనని అన్నారు. మొత్తంగా కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలు ఆడుతున్నాయన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారు కాబట్టి.. BJP,TRS కలిసి రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు జగ్గారెడ్డి. మోడీ..కేసీఆర్ ను  అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు.  సీఎం కేసీఆర్ ఢిల్లీ కి పోతేనే సమస్య పరిష్కారం కాలేదు..అలాంటిది మంత్రులు పోతే అవుతుందా.. రైతులను మభ్యపెట్టేందుకు TRS మంత్రులు డ్రామాలు ఆడుతున్నారన్నారు. 

తెలంగాణ రైతులు రోడ్ల మీద పడుకోకుండా ఏం చేస్తారో చెప్పాలన్న జగ్గారెడ్డి.. తాము అధికారంలోకి  వస్తే ... మా ప్రాధాన్యత రైతులేనన్నారు.  కొనుగోలు కేంద్రాలను మళ్లీ ఓపెన్ చేస్తామని..వరి సాగుకు కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు.