
- మోదీతో శంకుస్థాపన చేయించాలి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి దమ్ముంటే రాష్ట్రానికి ఐటీఐఆర్ తీసుకొచ్చి.. ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ నేతలు కేవలం కోతల రాయుళ్లు మాత్రమేనని ధ్వజమెత్తారు.
మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మూసీ ప్రక్షాళన అవినీతి కోసమేనని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. మరి గంగా ప్రక్షాళన కూడా మోదీ అందుకే చేస్తున్నారా? పనులు చేస్తే డబ్బుల కోసం అంటారు. చేయకపోతే చేయడం లేదు అంటారు. ఇదేం పద్ధతి’’ అంటూ బీజేపీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఇక అబద్ధాలకు తల్లిగారిల్లు కేసీఆర్ దేనని జగ్గారెడ్డి ఆరోపించారు.